Tuesday, March 3, 2026
E-PAPER
Homeజాతీయంసంయమనం పాటించండి

సంయమనం పాటించండి

- Advertisement -

నెతన్యాహూను కోరిన మోడీ
పశ్చిమాసియా నేతలతో టెలిఫోన్‌లో సంభాషణ

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ పశ్చిమాసియా నేతలతో టెలిఫోన్‌లో మాట్లాడారు. ఆ ప్రాంతంలో నెలకొన్న భద్రతా పరిస్థితిపై వారితో చర్చించారు. ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూకు ఫోన్‌ చేసిన మోడీ, తాజా పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. పౌరుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. సంయమనం పాటించాలని సూచించారు. శత్రుత్వాన్ని వీడాలని హితవు పలికారు. యూఏఈ అధ్యక్షుడు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ బిన్‌ జయేద్‌ అల్‌ నహ్యాన్‌తో కూడా మోడీ మాట్లాడారు. గల్ఫ్‌ దేశాలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. ఈ కష్టకాలంలో యూఏఈకి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. యూఏఈలో నివసిస్తున్న భారతీయుల భద్రతకు తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. పశ్చిమాసియా నేతలతో మాట్లాడడానికి ముందు జరిగిన భద్రతా వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ ఉన్నత స్థాయి సమావేశానికి మోడీ అధ్యక్షత వహించారు. మధ్యప్రాచ్యంలో క్షీణిస్తున్న భౌగోళిక, రాజకీయ పరిస్థితులపై చర్చించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -