నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల రెండవ తారీకు సోమవారం నుండి ఇంటర్మీడియట్ వృత్తి విద్య ప్రయోగ పరీక్షలు ప్రారంభమయ్యాయని ప్రిన్స్ పాల్ విజయదేవి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఆరవ తేదీతో ముగిసి 7 నుంచి 10 వరకు జనరల్ సైన్స్ ఇంటర్ రెండవ సంవత్సరం విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. రెండు నుండి ప్రారంభమైన వృత్తివిద్య ప్రయోగ పరీక్షలు ఇంటర్ రెండవ సంవత్సరం మొదటి సంవత్సరానికి కూడా జరగనున్నాయి. రెండు మరియు మూడో తేదీన ఉదయం జరిగిన పరీక్షకు 15 మంది విద్యార్థులకు గాను 12 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారుని తెలిపారు.
ముగ్గురు విద్యార్థులు గైరాజరయ్యారు మధ్యాహ్నం జరిగిన రెండవ సంవత్సరం పరీక్షకు మొత్తం 27 మంది విద్యార్థులకు గాను 27 మంది విద్యార్థులు 100% హాజరయ్యారని తాడిచెర్ల కళాశాల సెంటర్ ప్రయోగ పరీక్షల చీఫ్ సూపరిండెంట్ వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ సెంటర్లో తాడిచర్ల కళాశాల విద్యార్థులతో పాటు మల్హర్ మండలంలో గల కేజీబీవీ మరియు మోడల్ స్కూల్ సైన్స్ విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని ఇందులో రెండవ సంవత్సరం జనరల్ విద్యార్థులు మొత్తం 47 మంది అలానే ఒకేషనల్ విద్యార్థులు 42 మంది పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. మంగళవారం నాడు పరీక్ష సెంటర్ ను జిల్లా పరీక్షల కమిటీ అధికారి ఎం విజయ దేవి పర్యవేక్షించారు. పరీక్షలు మొత్తం కూడా సిసి కెమెరాల నిఘా నీడలో జరుగుతున్నాయని తెలిపారు.



