Wednesday, April 30, 2025
Homeప్రధాన వార్తలుప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్‌ కంపెనీలోభారీ పేలుడు

ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్‌ కంపెనీలోభారీ పేలుడు

  • – ముగ్గురు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం
  • – బాధిత కుటుంబాల ధర్నా
  • – యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లిలో ఘటన
  • నవతెలంగాణ-మోటకొండూరు
  • యాదాద్రిభువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామంలోని ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్‌ కంపెనీలో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురి పరిస్థితి విష మంగా ఉంది. వివరాల్లోకెళ్తే.. మంగళవారం సాయంత్రం ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్‌ కంపెనీ బిల్లింగ్‌ మిక్సింగ్‌ బంగ్లాలో మొత్తం 20 మంది షిఫ్ట్‌ల వారీగా పనులు ముగించుకొని వెళ్లిపో యారు. ఆరుగురు మాత్రమే బాంబులకు సంబం ధించిన మెటీరియల్‌ రోజూ వారీగా కలిపారు. ఆ సమయంలో ఒక్కసారిగా బాంబులు పేలాయి. భారీ పేలుళ్లకు పెద్దఎత్తున మంటలు చెలరేగ డంతో పాటు పొగ కమ్ముకుంది. భవనం మొత్తం కూలిపోయింది. ఈ ఘటనలో మోటకొండూరు గ్రామానికి చెందిన డేవిడ్‌ చరణ్‌(25), కాటేపల్లి గ్రామానికి చెందిన గునుగుంట్ల సందీప్‌(29) తీవ్రంగా గాయపడి అక్కడి కక్కడే మృతి చెందారు. నరేష్‌(28) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపో యాడు. సంద లింగస్వామి, మహేష్‌, శ్రీకాంత్‌ పరిస్థితి విషమంగా ఉంది. వారిని హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో తమకు న్యాయం చేయాలంటూ బాధితుల కుటుంబ సభ్యులు కంపెనీ ఎదుట ధర్నాకు దిగారు. ప్రమాదాల నివారణ చర్యలు, రక్షణ చర్యలు లేకపోవడం, కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ఇద్దరు ప్రాణం కోల్పోయారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కంపెనీ యాజమాన్యం పరంగా, ప్రభుత్వం పరంగా న్యాయం జరిగేలా కృషి చేస్తామని బాధితులకు హామీ ఇచ్చారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img