Wednesday, August 6, 2025
E-PAPER
Homeజాతీయంఆక్సిజన్‌ ప్లాంట్‌లో పేలుడు : ఇద్దరు మృతి

ఆక్సిజన్‌ ప్లాంట్‌లో పేలుడు : ఇద్దరు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : పంజాబ్‌ మొహాలీలోని ఆక్సిజన్‌ ప్లాంట్‌లో పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా ఇద్దరు మృతి చెందారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. మొహాలీలోని ఇండిస్టియల్‌ ఏరియా ఫేజ్‌ -9 యూనిట్‌లో ఉన్న ఆక్సిజన్‌ ప్లాంట్‌లో పేలుడు సంభవించింది.

ఈ పేలుడుతో అక్కడ ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. సబ్‌ – డివిజనల్‌ మెజిస్ట్రేట్‌తో సహా పోలీసులు, పౌర పరిపాలన నుండి సీనియర్‌ అధికారులు అక్కడి పరిస్థితిని అంచనా వేయడానికి, సహాయక చర్యలను పర్యవేక్షించడానికి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం మొహాలీలోని సివిల్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే పేలుడు సంభవించడానికి గల కారణాలేంటో తెలియలేదని, ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుందని అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -