Saturday, March 7, 2026
E-PAPER
Homeఖమ్మంవ్యవసాయంపై అవగాహన కోసం ఎక్స్పోజర్ విజిట్

వ్యవసాయంపై అవగాహన కోసం ఎక్స్పోజర్ విజిట్

- Advertisement -

– అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల ను సందర్శించిన అశ్వాపురం విద్యార్థుల
నవతెలంగాణ – అశ్వారావుపేట
 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం పీఎం శ్రీ జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల కు చెందిన 92 మంది విద్యార్థులు,12 మంది ఉపాధ్యాయులు తో కూడిన పాఠశాల బృందం ఎడ్యుకేషన్ టూర్ గా,ఎక్స్పోజర్ విజిట్‌లో భాగంగా శుక్రవారం స్థానిక వ్యవసాయ కళాశాలను సందర్శించారు. విద్యార్థులకు వ్యవసాయం,పంటల పరిశోధన, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై ప్రత్యక్ష అవగాహన కల్పించేందుకు ఈ విజిట్ నిర్వహించారు.

కళాశాల ప్రాంగణంలో వివిధ పంటల సాగు విధానాలు, ఆధునిక వ్యవసాయ సాంకేతికతలు, పరిశోధన పద్ధతుల గురించి విద్యార్థులకు అక్కడి నిపుణులు వివరించారు.విద్యార్థులు ఆసక్తిగా పరిశీలిస్తూ అనేక సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు యోగితా వేణి నాయకత్వం వహించారు. ఉపాధ్యాయులు జ్యోతి, ప్రశాంత్ కుమారి, ప్రసన్న, సుధా, శ్రీను, హనుమంతరావు, కృష్ణ, వెంకటకృష్ణ, రామ్ దాస్, వరలక్ష్మి తదితరులు విద్యార్థులను మార్గనిర్దేశం చేశారు.

విద్యార్థులకు పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రత్యక్ష అనుభవం ద్వారా వ్యవసాయంపై అవగాహన పెంపొందించేందుకు ఈ ఎక్స్పోజర్ విజిట్ ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని ఉపాధ్యాయులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -