Tuesday, February 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఎక్స్‌పోజర్ విజిట్

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఎక్స్‌పోజర్ విజిట్

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎక్స్‌పోజర్ విజిట్ కార్యక్రమంలో భాగంగా వివిధ చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించినట్లు ఎంఈఓ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజాగంగారెడ్డి తెలిపారు. ఈ సందర్శనలో అలీ సాగర్ గార్డెన్, జానకంపేట్ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, సారంగాపూర్ హనుమాన్ టెంపుల్, బాసర సరస్వతి ఆలయం, డిచ్‌పల్లి రామాలయాన్ని విద్యార్థులు దర్శించుకున్నారు. ఎక్స్‌పోజర్ విజిట్ ద్వారా విద్యార్థులకు చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక అవగాహన పెరుగుతుందని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -