- Advertisement -
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ : బీసీ కులగనలపై రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం కేబినెట్ ఆమోదం తెలపడం హర్షం వ్యక్తం చేస్తూ శనివారం హుస్నాబాద్ పట్టణం లో కాంగ్రెస్ నాయకులు స్వీట్లు పంపిణీ చేస్తూ సంబరాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ కేడం లింగముర్తి, మార్కెట్ వైస్ ఛైర్మన్ బంక చందు , సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య , కాంగ్రెస్ పట్టణ మాజీ అధ్యక్షుడు హక్కు శ్రీనివాస్ , చిత్తారి పద్మ రవీందర్ వెన్న రాజు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -