Friday, January 9, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఓటర్ల తుది జాబితా గడువు పెంచండి

ఓటర్ల తుది జాబితా గడువు పెంచండి

- Advertisement -

ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీల వినతి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఓటర్ల తుది జాబితా గడువును పెంచాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి వివిధ రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేశాయి. గురువారం హైదరాబాద్‌లోని ఎన్నికల సంఘం కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణి కుముదిని సమావేశం నిర్వహించారు. వార్డుల విభజన సహేతుకంగా లేదనీ, రెండు చోట్ల ఓట్లున్న వారి ఓట్లను రద్దు చేయాలని
సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఓటర్ల జాబితా ప్రచురిస్తామనీ, ప్రస్తుతం సవరణలకు అవకాశం లేదని రాజకీయ పార్టీలు లేవనెత్తిన అంశాలపై ఆమె వివరణ ఇచ్చారు.

”రాష్ట్రంలోని ఆరు మున్సిపల్‌ కార్పొరేషన్లలోని (366) వార్డులు, 117 మున్సిపాల్టీల్లోని (2,630) వార్డులకు తెలంగాణ మున్సిపాల్టీ చట్టం, 2019లోని సవరించిన సెక్షన్‌ 195-ఏ ప్రకారం వార్డు వారీ ఓటర్ల తుది జాబితాను ఈ నెల 12న ప్రచురిస్తాం. 13 నాటికి పోలింగ్‌స్టేషన్ల వివరాల ముసాయిదా జాబితాను ప్రచురించి వాటిని టీ పోల్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తార. జనవరి 16న పోలిం గ్‌స్టేషన్ల వివరాలతో పాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను వార్డుల్లో ని పోలింగ్‌ స్టేషన్ల వారీగా ప్రచురిస్తాం” అని రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మాజీ శాసనసభ్యులు నంద్యాల నర్సింహరెడ్డి, సీపీఐ(ఎం) సీనియర్‌ నేత డీజి.నర్సింహరావు, సీపీఐ రాష్ట్ర సహాయ కారద్యర్శి ఈటీ.నర్సింహ, కాంగ్రెస్‌ నాయకులు రాఘవేంద్ర, బీఆర్‌ఎస్‌ నాయకులు సోమ భరత్‌, దేవి ప్రసాద్‌, బీజేపీ నాయకులు మర్రి శశిధర్‌రెడ్డి ఇతర పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -