Thursday, January 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గురుకుల టీజీ సెట్-2026 ప్రవేశాలకు గడువు పొడిగింపు

గురుకుల టీజీ సెట్-2026 ప్రవేశాలకు గడువు పొడిగింపు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
తెలంగాణ రాష్ట్రంలో టి.ఆర్.ఇ.ఐ.ఎస్ టీజీ డబ్ల్యూ ఆర్ ఈ ఐ, నూతన ప్రవేశాలకోసం 5వ తరగతి ప్రవేశాలతోపాటు 6,7,8,9) బ్యాంక్ లాంగ్ సీట్ల భర్తీకి ట్రావెల్ పరీక్ష టీజీ సెట్-2026 దరఖాస్తు గడువును ఈ నెల 25 వ తేదీవరకు పొడగించినట్లు నిజామాబాదు ఉమ్మడి జిల్లాల తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కన్వీనర్(హైదరాబాదు) నీరడి గంగాశంకర్, మద్నూరు తెలంగాణ గురుకుల బాలుర విద్యాలయం జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అర్సేవార్ సుధాకర్ లు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ప్రవేశం పొందే అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్థును చేసుకోవాలని చెప్పారు.దరఖాస్తుల్లో ఏవైనా సవరణలుంటే జనవరి 25 సాయంత్రం 5 గంటల వరకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.

SC,ST,BC మరియు 5 వ తరగతి మరియు 6,7,8,9 తరగతుల్లో ప్రవేశమునకై 22-02-2026 నాడు ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1గంటవరకు ఎంపిక చేయబడిన కేంద్రాల్లో ప్రవేశపరీక్ష నిర్వహించబడునని చెప్పారు. అభ్యర్థులు దరఖాస్తులను ఆన్ లెన్ లో సమర్పించాలని చెప్పారు.https://tgcet.cgg.gov.in లేదా https://tgswreis.telangana.gov in లేదా https:// tgtwgurukula.telangana.gov.in లేదా https://mjptbcwreis.telangana.gov.in మొదలగు వెబ్ సైట్లను చూడవచ్చని చెప్పారు. రూ.100/- చెల్లించి దరఖాస్తును చేసుకొనవచ్చని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -