Monday, January 19, 2026
E-PAPER
Homeకరీంనగర్గణతంత్ర దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలి

గణతంత్ర దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలి

- Advertisement -

ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల

ఈ నెల 26వ తేదీన భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని  అధికారులను ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ పై జిల్లా అధికారులతో సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలోని పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించేందుకు గ్రౌండ్, డయాస్ ను పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పూల అలంకరణతో సిద్దం చేయాలని సూచించారు. వేడుకల సందర్బంగా ప్రజా ప్రతినిధులకు, జిల్లా అధికారులకు, ప్రజలకు సీటింగ్ ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలు జరుగుతున్న అభివృద్ది సంక్షేమ పథకాలతో కూడిన స్టాళ్లు, శకటాల ప్రదర్శనలను ఏర్పాటు చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్బంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించుటకు వీలుగా, వివిధ అభివృద్ది సంక్షేమ పథకాలతో కూడిన ప్రగతి సందేశాన్ని తయారు చేయాలని జిల్లా ప్రణాళిక అధికారికి సూచించారు. విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా ఆ శాఖ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మెడికల్ సిబ్బంది ఉండాలని పేర్కొన్నారు. గ్రౌండ్ లో పారిశుధ్య పనులను సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.
వేడుకల సందర్బంగా గ్రౌండ్ కు వచ్చు ప్రజలకు, విద్యార్థిణి, విద్యార్థులకు త్రాగు నీటికి  వాటర్ బాటల్స్ సమకూర్చాలని, జాతీయ భావం పెంపోందెలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని డీఈఓను ఆదేశించారు.

జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందించేందుకు ప్రతిపాదనలు పంపించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -