నవతెలంగాణ – జడ్చర్ల
జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీఎస్ ఆదేశాల మేరకు, డీఎస్పీ వెంకటేశ్వర్లు నేతృత్వంలో, జడ్చర్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ఆదివారం ఉదయం శాంతి నగర్, శ్రీరామ్ నగర్ ప్రాంతాల్లో విస్తృతంగా కార్డన్, సెర్చ్ ఆపరేషన్ నిర్వహించబడింది.
ఆపరేషన్ సమయంలో వెలుగులోకి వచ్చిన అంశాలు:
150 ఇళ్లను సోదచేయడం జరిగింది
సరైన పత్రాలు లేని 19 మోటర్ బైకులు స్వాధీనం చేసుకున్నారు
6 ఆటో రిక్షాలు అనుమానాస్పదంగా ఉండడంతో ధృవీకరణ కోసం నిలిపివేశారు
కాలనీలో నివాసం ఉంటున్న సందేహాస్పద వ్యక్తులపై విచారణ చేపట్టారు
కొన్ని ఇళ్లలో అసాధారణ కదలికలు గమనించి, మౌలిక సమాచారం సేకరించారు
కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశాలు:
అక్రమ వాహనాలు, నేర చట్రాలు గుర్తించి నివారించడం
శాంతి భద్రతల పరిరక్షణకు అనుమానాస్పద వ్యక్తుల వివరాలు సేకరించడం
గూండాలు, డ్రగ్స్, మత్తు పదార్థాల సరఫరా వంటి నేరాలపై కట్టుదిట్టమైన నిఘా ఉంచడ
ప్రజల్లో పోలీస్ పై విశ్వాసం పెంపొందించి, భద్రతా వాతావరణం నెలకొల్పడం
ఈ సందర్భంగా DSP వెంకటేశ్వర్లు మాట్లాడుతూ“ప్రజల భద్రత మా మొదటి కర్తవ్యం. కార్డన్ & సెర్చ్ ద్వారా అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను గుర్తించి నేరాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు తమ పరిసరాల్లో అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి” అని తెలిపారు.
ప్రజలకు పోలీసుల సూచనలు:
సరైన పత్రాలు లేని వాహనాలను నడపరాదు
కొత్త అద్దెదారుల వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోబడతాయి
ఏదైనా అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే 100 నంబర్‌కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి
మహబూబ్ నగర్ పోలీసులు ప్రజల భద్రతకు కట్టుబడి ఉన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఇటువంటి తనిఖీలు తరచుగా కొనసాగుతాయి. ఈ కార్యక్రమంలో జడ్చర్ల టౌన్ ఇన్స్పెక్టర్ కమలాకర్, జడ్చర్ల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగార్జున గౌడ్, ఎస్‌ఐలు జయప్రసాద్, మల్లేష్, చంద్రమోహన్, ఖాదర్, రాజాపూర్ ఎస్‌ఐ శివానంద్ తదితర పోలీసులు పాల్గొన్నారు.



