Monday, January 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విస్తృతంగా ఆపరేషన్ స్మైల్ పోగ్రామ్

విస్తృతంగా ఆపరేషన్ స్మైల్ పోగ్రామ్

- Advertisement -

డ్రాపౌట్ పిల్లను గుర్తించిన అధికారులు
నవతెలంగాణ – మల్హర్ రావు

భూపాలపల్లి జిల్లా ఎస్పీ సంకీర్త్,శిశుసంక్షేమ శాఖ ఆదేశాలతో సంయుక్తంగా కొయ్యుర్ ఎస్ఐ-2 రాజన్ కుమార్, అంగన్ వాడి సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి సోమవారం ఆపరేషన్ స్మైల్ పోగ్రామ్ కొయ్యుర్ పివినగర్, మల్లారం గ్రామాల్లో విస్తృతంగా నిర్వహించారు. (డ్రాఫౌట్) వివిధ కారణాలతో మధ్యలో బడి మానేసిన విద్యార్థులను గుర్తించారు. అనంతరం తల్లిదండ్రులకు, విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించిన పివినగర్ విద్యార్థిని వళ్లెంకుంట పాఠశాలలో, మల్లారం విద్యార్థులను ఐదుగురుని మల్లారం ప్రభుత్వ పాఠశాలలో,ఇద్దరిని తాడిచెర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాయిన్ చేశారు. ఈ కార్యక్రమంలో కొయ్యుర్ ఏఎస్ఐ సుధీర్, పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -