Sunday, March 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

- Advertisement -

నవతెలంగాణ – మెట్‌పల్లి రూరల్
మెట్‌పల్లి మండలం సత్తక్కపల్లె గ్రామంలో నగునూరు ప్రతిమ ఆస్పత్రి సహకారంతో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించిన ఈ శిబిరంలో మొత్తం 153 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో 32 మందిని శస్త్రచికిత్సలకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.ఎంపికైన వారిని ఆసుపత్రికి ప్రత్యేక వాహనం ద్వారా తరలించి ఉచిత శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. శిబిరంలో రోగులకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. మారుమూల గ్రామాల్లో కూడా ఇలాంటి వైద్య శిబిరాలను మరింతగా నిర్వహించి ప్రజలకు సేవలు అందిస్తామని ప్రతిమ ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మహేందర్ రెడ్డి, ఎర్రాపూర్ సర్పంచ్ రచన హరీష్, ప్రతిమ మార్కెటింగ్ ప్రతినిధి అలీ, ఫౌండేషన్ సభ్యులు విజయ, శ్రీకాంత్, దొరసాని తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -