నవతెలంగాణ – హైదరాబాద్ : తొర్రూర్ మున్సిపల్ కార్యాలయం వద్ద సోమవారం ఉద్రిక్తత నెలకొంది. తొర్రూర్ మున్సిపాలిటీలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వస్తున్న బిఆర్‌ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమైన పోలీసులు రంగప్రవేశం చేసి కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా, పరిస్థితి క్షణాల్లో ఉద్రిక్తంగా మారింది. ఇంతలో పాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి మున్సిపాలిటీ కార్యాలయానికి చేరుకొని కాంగ్రెస్ కౌన్సిలర్లను కార్యాలయం లోపలికి తీసుకెళ్లారు. ఆమెకు తోడుగా ఎంపీ కడియం కావ్య కూడా మున్సిపాలిటీ కార్యాలయంలోకి ప్రవేశించారు. మున్సిపాలిటీ కార్యాలయం బయట బిఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకోగా పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో తొర్రూరు డీఎస్పీ అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను విడదీసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మున్సిపల్ చైర్మన్ పీఠం కోసం రాజకీయ పోరు తీవ్రంగా సాగుతోంది. ఇరువర్గాల కార్యకర్తలు మున్సిపల్ కార్యాలయం ముందు ఏ పార్టీలో కార్యకర్తలు తోపులాటలు కొట్లాటలకు దారితీసే అవకాశం ఉంది.
తొర్రూరు మున్సిపాలిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



