Wednesday, January 28, 2026
E-PAPER
Homeఖమ్మంనేత్రదానం శ్రేష్ఠమైన దానం

నేత్రదానం శ్రేష్ఠమైన దానం

- Advertisement -

– ఖమ్మం నేత్రనిధి టెక్నిషియన్ మందా నాగేశ్వరరావు 
నవతెలంగాణ – బోనకల్ : నేత్రదానం శ్రేష్ఠమైన దానం అని ఖమ్మం నేత్రనిధి టెక్నిషియన్ మందా నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే బోనకల్ మండలం చొప్పకట్లపాలెం గ్రామానికి చెందిన టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా మాజీ కార్యదర్శి ఆ గ్రామ ఉప సర్పంచ్ పల్లా కొండలరావు తండ్రి పల్లా రామకోటయ్య (93) మంగళవారం రాత్రి మరణించారు. కుటుంబ సభ్యులు ఆయన కళ్ళను ఖమ్మం నేత్రనిధికి దానం చేశారు. బుధవారం ఉదయం నేత్రదానం అనంతరం నాగేశ్వరరావు మాట్లాడుతూ నేత్రదానం వల్ల కార్నియా సమస్య ఉన్న 15-20 సంవత్సరాల వయసున్న ఇద్దరికి చూపు తెప్పించడానికి ఉపయోగపడుతుందన్నారు. చొప్పకట్లపాలెంలో ఇప్పటికి 20కి పైగా నేత్రదానం చేసి జిల్లాలో ప్రధమ స్థానంలో నిలిచిందన్నారు. మరణానంతరం ప్రతి ఒక్కరు కళ్ళు దానం చేయటం వలన ఆ కళ్ళు మరొకరికి చూపునిస్తాయన్నారు. మరణానంతరం వారి కళ్ళను దానం చేసేందుకు కుటుంబ సభ్యులందరూ ఆలోచించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పల్లా రామకోటయ్య కుమారుడు, పల్లెప్రపంచం ఫౌండేషన్ అధ్యక్షులు పల్లా కొండలరావు, కుటుంబ సభ్యులు పల్లా స్వరాజ్యలక్ష్మి, కృష్ణకుమారి, మండెపుడి విజయలక్ష్మి, దండముడి శేషుకుమారి, యడ్లపల్లి లీల, మండెపుడి శ్రీలక్ష్మి, చలమల అజయ్ కుమార్, కొండేటి అప్పారావు, మార్కపూడి రజిని, బోయినపల్లి లక్ష్మి, బోయినపల్లి పున్నయ్య, బండి శ్రీనివాసరావు, చలమల హరికిషన్ రావు, ఉన్నం వెంకటేశ్వర్లు, బాలు పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -