- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలుగు సినిమా పైరసీకి కేంద్రంగా మారిన ‘ఐబొమ్మ’ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమంది రవి నేడు చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. పైరసీ కేసులో అరెస్టయిన రవికి తెలంగాణ హైకోర్టు మంగళవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే.
తెలుగు సినిమాలను పైరసీ చేస్తూ వెబ్‌సైట్‌లో అక్రమంగా అప్‌లోడ్ చేస్తున్నారన్న ఆరోపణలపై సైబర్ క్రైమ్ పోలీసులు మూడు నెలల క్రితం, గత నవంబరులో రవిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విదేశాల నుంచి వెబ్‌సైట్‌ను నడుపుతూ, బెట్టింగ్ యాప్‌ల ద్వారా కోట్ల రూపాయలు ఆర్జించినట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఈ పైరసీ వల్ల తెలుగు చిత్ర పరిశ్రమకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లినట్లు ఫిర్యాదులు అందాయి.
- Advertisement -



