సబ్బుకు బదులు ఫేస్‌ వాష్‌..

ఫేస్‌వాష్‌ వాడటం వల్ల ముఖం శుభ్రంగా ఉంటూనే తేమను కోల్పోకుండా ఉండే అవకాశం ఉంది. సహజమైన పదార్థాలతో తయారుచేసిన ఫేస్‌ వాష్‌ అఫేస్‌వాష్‌ వాడటం వల్ల ముఖం శుభ్రంగా ఉంటూనే తేమను కోల్పోకుండా ఉండే అవకాశం ఉంది. సహజమైన పదార్థాలతో తయారుచేసిన ఫేస్‌ వాష్‌ అయితే చర్మాన్ని మదువుగా శుభ్రపరచడంతో పాటు లోతుగా క్లీన్‌ చేస్తుంది. సబ్బుతో పోలిస్తే, ఫేస్‌వాష్‌ ద్వారా జూన బ్యాలెన్స్‌ సరిగ్గా మెయింటైన్‌ అవుతుంది. ఫేస్‌వాష్‌ మురికిని తొలగిస్తూనే చర్మానికి తేమను అందిస్తుంది. రోజూ ఉదయం, రాత్రి ముఖాన్ని ఫేస్‌వాష్‌తో శుభ్రం చేసుకోవడం ముఖ చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఫేస్‌వాష్‌ వాడే విధానాన్ని కూడా సరిగ్గా పాటించాలి. ముఖాన్ని ముందుగా గోరువెచ్చటి నీటితో తడిపి కొద్దిగా ఫేస్‌వాష్‌ తీసుకుని మదువుగా రుద్దాలి. కనీసం 30 సెకన్లు ముఖంపై మసాజ్‌ చేసిన తర్వాత కడిగేయాలి. ఎక్కువసేపు ఫేస్‌వాష్‌ మిగిలి ఉండకూడదు. ముఖాన్ని శుభ్రం చేసిన తర్వాత మంచి మాయిశ్చరైజర్‌ వాడటంవల్ల ముఖాన్ని మదువుగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎక్కువ కెమికల్స్‌ కలిగిన ఫేస్‌వాష్‌లు కాకుండా నేచురల్‌, మైల్డ్‌ ప్రోడక్ట్‌లను ఎంచుకోవడం మంచిది. ముఖ చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉండాలంటే సబ్బుల వాడకాన్ని తగ్గించి మంచి ఫేస్‌వాష్‌ను ఎంచుకోవడం ఉత్తమం.

Spread the love