పరీక్షల ఫలితాల సీజన్ వచ్చిందంటే ఓ పండుగ వాతావరణం కనిపించాలి. కానీ ఈ రోజు గెలిచిన వారి ముఖాల్లో చిరునవ్వులు కన్నా కన్నీళ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకిలా మారింది మన సమాజం? ఎందుకు పరీక్షలు జీవితాన్ని కొలిచే గీటురాళ్లైపోయాయి?
టెక్నాలజీ అభివద్ధి చెందిన contemporary యుగంలోనూ, చిన్న అపజయం వల్ల విద్యార్థులు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్న దుస్థితి మనల్ని ఆలోచింపజేయాల్సిందే. ‘వైఫల్యం బంగారు గని లాంటిదే’ అని అనడానికి కారణం ఉంది. ఎందుకంటే గెలుపు ఒక్కటి నేర్పలేని ఎన్నో జీవిత పాఠాలు ఓటమి నేర్పుతుంది. ఇది జీవితాన్ని తిరిగి మలిచే అవకాశంగా మలచుకోవాలి.
చదువు ఒక ఫ్రెండ్ వంటి అనుభూతిని కలిగించాలి. అది భయానికి కాదు, అభివద్ధికి మార్గం కావాలి. పరీక్షల్లో ఓడిపోయినప్పుడు ఆగిపోకూడదు. మరింత శ్రమించి ముందుకెళ్లాలి. గమ్యం చేరడమే ముఖ్యమని గుర్తించాలి, గెలుపో ఓటమో కాదు.
ఈ మార్గంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. వారు పిల్లల వైఫల్యాన్ని తిట్టడం ద్వారా కాకుండా, ఏ తప్పు జరిగిందో అర్థం చేసుకుని, ప్రేమతో మార్గనిర్దేశనం చేయాలి. ఎందుకంటే కొందరు పిల్లలు తల్లిదండ్రుల మాటల్ని బాధగా తీసుకుని, ఏవిధమైన అపజయం వచ్చినా ఆత్మహత్య వరకు వెళ్లే పరిస్థితిలోకి చేరుతున్నారు.
ప్రస్తుతం విద్యా వ్యవస్థను చూస్తే మార్కులు, ర్యాంకులే విజయానికి కొలమానం అయిపోయాయి. పిల్లలు చదివే యంత్రాల్లా తయారవుతున్నారు. వారిలో మానవత్వం, స్వాతంత్య్ర ఆలోచనలే మాయమవుతున్నాయి. చదువు, మార్కులే జీవితమనే మిథ్యా విశ్వాసాన్ని సమాజం బలపరుస్తోంది.
మన పిల్లలకు సంగీతం, పుస్తకాలు, రాయడం, మాట్లాడడం వంటి ఇతర అభిరుచులు కూడా ఉండేలా చేయాలి. ఇంటర్నెట్‌లో రోజుకు రెండు గంటలు గడిపే బదులుగా, ఒక్క గంట పుస్తకాలు చదివితే ఎంత మార్పు వస్తుందో చూద్దాం. స్నేహితుల కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేసే సజనాత్మకతను, వాళ్ల కెరీర్‌లోనూ వినియోగించగలగాలి.
ప్రభుత్వం కూడా విద్యార్థుల మానసిక ఒత్తిడి, ఆత్మస్థైర్యం, తల్లిదండ్రుల అవగాహనపై దష్టి పెట్టాలి. కౌన్సెలింగ్ అవసరం ఎంతైనా ఉంది. ప్రతి పాఠశాలలో ఒక ్‌తీaఱఅవస ఎవఅ్aశ్రీ ష్ట్రవaశ్ర్‌ీష్ట్ర జూతీశీటవరరఱశీఅaశ్రీ ఉండాలి. పరీక్షల సమయంలో వారిని భయపెట్టే పరిస్థితులు తొలగించాలి.
పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే… ముందుగా మన ఆలోచనలు మారాలి. విద్యార్థులు మనవాళ్లే. వాళ్లని మార్కుల మిషన్లుగా మార్చే అర్హత మనకెక్కడుంది?
పరీక్ష ఫలితాల్లో ఒక్కసారి అపజయమొస్తే మరల ప్రయత్నించే స్ఫూర్తిని నూరిపోసేలా చేద్దాం. సంతోషం, గర్వం, సంతప్తి… ఇవన్నీ మార్కుల్లో కాదు, మన బిడ్డల ఎదుగుదలలో చూడాలి.
వైఫల్యాన్ని నిందించ వద్దు, నేర్చుకోండి. పిల్లలపై ప్రేమ చూపండి, ఒత్తిడి కాదు. వారి ప్రయాణంలో భాగస్వాములు అవ్వండి .
డా|| హిప్నో పద్మా కమలాకర్,
9390044031
కౌన్సెలింగ్, సైకో థెరపిస్ట్,
హిప్నో థెరపిస్ట్
వైఫల్యం బంగారు గని లాంటిదే
- Advertisement -
- Advertisement -