- Advertisement -
నవతెలంగాణ – అమరావతి: గుంటూరులో దొంగనోట్లు పట్టుబడటం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే… రత్నగిరి కాలనీకి చెందిన గోపిరెడ్డి, జ్యోతి అనే ఇద్దరు వ్యక్తులు నకిలీ 500 నోట్లు మారుస్తూ పట్టుబడ్డారు. వీరు నకిలీ నోట్లను మారుస్తుండగా స్థానికులు గమనించారు. వీరిని నిలదీయగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో, పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుంటుండగా… ఒక వ్యక్తి బ్యాగ్ తో పరారయ్యాడు. గోపిరెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు జరిపి, విచారిస్తున్నారు.
- Advertisement -