అరెస్ట్ చేసిన మావోయిస్టులను కోర్టుల్లో హాజరుపర్చాలి
ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బూటకపు ఎన్‌కౌంటర్లను వెంటనే ఆపాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుపల్లి ఏజెన్సీలో మంగళవారం మావోయిస్టు అగ్రనాయకులు హిడ్మాతో పాటు ఆరుగురు ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్టు పోలీసులు ప్రకటించారు. బుధవారం అదే ప్రాంతంలో మరో ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టు నాయకులు చనిపోయారని ప్రకటించారు. అందులో అగ్ర నాయకులు దేవ్‌జీ, ఆజాద్ కూడా ఉన్నారనే వార్తలొస్తున్నాయి. సంఘటనలు జరిగిన తీరు చూస్తుంటే మావోయిస్టులను అరెస్ట్ చేసి, నిర్బంధించి, బూటకపు ఎన్‌కౌంటర్లకు పాల్పడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలి” అని జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. మావోయిస్టులు కాల్పులు విరమించి చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని పలుమార్లు ప్రకటించినప్పటికీ, వారితో ఎందుకు చర్చలు జరపడం లేదని ప్రశ్నించారు. బీజేపీ సర్కార్ ఏక పక్షంగా వారిని ఏరి వేసేందుకు కుట్రలకు పాల్పడుతున్నదని విమర్శించారు. సానుభూతిపరులు, అమాయక గిరిజనులను అరెస్టులు చేసి చిత్రహింసలకు గురి చేస్తేన్నారని విమర్శించారు. విజయవాడ, తదితర ప్రాంతాల్లో 50 మందికి పైగా మావోయిస్టులను అరెస్టు చేసారనీ, ఇంకా కొంతమందిని నిర్బంధించారనే వార్తల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసిన వారందరిని వెంటనే కోర్టులో హాజరు పర్చాలని డిమాండ్ చేశారు.
బూటకపు ఎన్‌కౌంటర్లు వెంటనే ఆపాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



