Saturday, October 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నకిలీ పురుగు మందుల తయారీ కేంద్రం గుట్టురట్టు 

నకిలీ పురుగు మందుల తయారీ కేంద్రం గుట్టురట్టు 

- Advertisement -

– 15 ఏళ్లుగా రూ.కోట్ల లోసంపాదన
– అధికారుల కనుసన్నల్లోనే నకిలీ పురుగుమందుల తయారీ 
– అధికారులపై కలెక్టర్ కు ఫిర్యాదు అనడంతో దాడులు
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల 

15 ఏళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా నకిలీ పురుగుమందులు తయారు చేస్తున్న కేంద్రంపై శనివారం పోలీసు, వ్యవసాయ అధికారులు దాడులు చేపట్టిన సంఘటన శనివారం జోగులంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది.

జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం పులికల్ గ్రామంలో  అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా సూపర్ సింబోలా మైక్రోనూట్రింట్ కంపెనీ పేరు పెట్టి నకిలీ మందులు తయారు చేస్తూ రైతులను మోసం చేస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.   పులికల్ గ్రామానికి చెందిన వీరేష్ గత 15 ఏళ్లుగా బయో కంపెనీ పేరుతో నకిలీ పురుగుమందులు తయారు చేస్తూ రూ. కోట్లల్లో ఆర్జించినట్లు స్థానికులు తెలిపారు. 15 ఏళ్లుగా మండలానికి చెందిన వివిధ స్థాయిల అధికారులకు మామూలు ముట్ట చెబుతూ ఈ తతంగం నడిపిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.

అదేవిధంగా గ్రామానికి చెందిన బడ రాజకీయ నాయకుని అండదండలు కూడా పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తుంది. బడ నాయకునితోపాటు ఆయన అనుచరులకు మామూలు ముట్ట చెప్పడంతో ఈ విషయం బయటకి పోక్కనివ్వలేదు. శనివారం ఐజ మండల కేంద్రానికి చెందిన ఒక వ్యక్తి ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని అధికారులను భయపెట్టినట్లు సమాచారం. దీంతో పోలీసు, వ్యవసాయ అధికారులు రంగంలోకి దిగి నకిలీ పురుగుమందుల తయారీ కేంద్రాన్ని గుట్టురట్టు చేశారు. పురుగు మందు తయారు చేస్తున్న వివిధ కంపెనీలకు చెందిన నకిలీ లేబుల్లు, కాళీ బాటిల్లు, నకిలీ మందులు నింపిన బాటిల్లు స్వాధీనం చేసుకొని వీరేష్ ను అరెస్టు చేశారు. దాడుల్లో అయిజ పట్టణ ఎస్సై శ్రీనివాసరావు,  అయిజ మండల వ్యవసాయ అధికారి జనార్దన్ రావు ఉన్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో అమ్మకాలు

జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం పులికల్ గ్రామంలో తయారు చేస్తున్న నకిలీ పురుగుమందులను తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో ఉన్న పురుగుమందుల షాపులకు సరఫరా చేస్తూ కోట్ల రూపాయలు అర్జించినట్లు సమాచారం. అదేవిధంగా నీటిపారుదల ఉన్న పెద్దపెద్ద గ్రామాలలో ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని పురుగుమందులు విక్రయిస్తున్నట్లు సమాచారం. రూ.10  విలువ కూడా చేయని మందులను రూ.వందల్లో అమ్మి సొమ్ము చేసుకున్నట్లు తెలిసింది. పురుగుమందుల షాపులను నిర్వహిస్తున్న డీలర్లకు ఎక్కువ మొత్తంలో లాభాలు చెల్లిస్తూ రైతులకు నకిలీ మందులు అంటగడుతున్నారు. పోలీస్ అధికారుల వివరాల ప్రకారం ఇప్పటికే రూ. 50 కోట్లు ఆర్జించినట్లు సమాచారం. నకిలీ మందులు తయారు చేస్తూ పట్టుబడ్డ వీరేశను పూర్తిస్థాయిలో విచారిస్తే అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -