Monday, February 23, 2026
E-PAPER
Homeజాతీయంనకిలీ యూనివర్సిటీలు

నకిలీ యూనివర్సిటీలు

- Advertisement -

బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే అధికం..
దేశరాజధానిలోనే 12 ఫేక్‌ యూనివర్సిటీలు
ఆ తర్వాతి స్థానం యూపీదే…
మోసపోతున్న విద్యార్థులు
యూజీసీ హెచ్చరిస్తున్నా చర్యలు శూన్యం

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దేశంలో నకిలీ యూనివర్సిటీల సంఖ్య పెరిగిపోతోంది. వాటిని కట్టడి చేయండని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్ని లేఖలు రాసినా ప్రయోజనం శూన్యం. 2025 అక్టోబర్‌ నాటికి దేశంలో 22 నకిలీ యూనివర్సిటీలు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 32కి పెరిగింది. ఈ యూనివర్సిటీలతో మోసపోతున్న విద్యార్థులు భారీ సంఖ్యలో ఉన్నారు. నకిలీ యూనివర్సిటీలు అత్యధికంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఉండటం గమనార్హం. దేశరాజధాని ఢిల్లీలోనే 12 ఫేక్‌ యూనివర్సిటీలు ఉన్నాయని యూజీసీ మొత్తుకుంటున్నా చర్యలు శూన్యం. ఇక్కడ కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాలే అధికారంలో ఉండటం గమనార్హం. ఇక రెండో స్థానంలో ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం ఉంది. ఇక్కడ నాలుగు నకిలీ యూనివర్సిటీలు రాజ్యమేలుతున్నాయి. వాటిపై చర్యలు తీసుకొనేందుకు అక్కడి బుల్డోజర్‌ యోగీ సర్కార్‌కు చేతులు రావట్లేదు.

వీటితో పాటు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్‌, రాజస్థాన్‌, ఝార్ఖండ్‌, హర్యానా, అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లోనూ ఫేక్‌ యూనివర్సిటీలు ఉన్నాయి. విద్యార్థులు ఈ నకిలీ యూనివర్సిటీల మాయలో పడితే భవిష్యత్‌ ప్రమాదంలో పడినట్లే. డబ్బుతోపాటు విద్యార్ధి జీవితాన్ని, భవిష్యత్‌ను కూడా నష్టపోతారు. ప్రస్తుతం అడ్మిషన్ల సీజన్‌ నడుస్తుండటంతో యూజీసీ విద్యార్థుల్ని అప్రమత్తం చేస్తూ, చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ లేఖలు రాసింది. 2023 నుంచి నకిలీ యూని వర్సిటీల కట్టడిపై సాక్ష్యాధారాలతో సహా యూజీసీ లేఖలు రాస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది. నకిలీ విశ్వవిద్యాలయాలు జారీ చేసే డిగ్రీలకు ఏమాత్రం చట్టబద్ధత ఉండదు. ఉద్యోగావకాశాలు, ప్రభుత్వ సర్వీసులు, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాలకు ఇవి చెల్లుబాటు కావు. నకిలీ యూనివర్సి టీలు ప్రధానంగా గ్రామీణ విద్యార్థుల్ని లక్ష్యంగా చేసుకొని, ఎక్కడికక్కడ ఏజెంట్ల వ్యవస్థ ద్వారా అడ్మిషన్లు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇలాంటి యూనివర్సిటీల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి.

ఇవీ ఫేక్‌ యూనివర్సిటీలు
(1) ఆంధ్రప్రదేశ్‌ క్రైస్ట్‌ న్యూ టెస్టమెంట్‌ డీమ్డ్‌ యూనివర్సిటీ (2) ఆంధ్రప్రదేశ్‌ బైబిల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఇండియా (3) అరుణాచల్‌ ప్రదేశ్‌ ఇండియన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆల్టర్నేటివ్‌ మెడిసిన్‌ (4) ఢిల్లీ వరల్డ్‌ పీస్‌ ఆఫ్‌ యునైటెడ్‌ నేషన్స్‌ యూనివర్సిటీ (5) ఢిల్లీ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్మెంట్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ (6) ఢిల్లీ ఆల్‌ ఇండియా ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ అండ్‌ ఫిజికల్‌ హెల్త్‌ సైన్సెస్‌ (7) ఢిల్లీ కమర్షియల్‌ యూనివర్సిటీ లిమిటెడ్‌ (8) ఢిల్లీ యునైటెడ్‌ నేషన్స్‌ యూనివర్సిటీ (9) ఢిల్లీ వొకేషనల్‌ యూనివర్సిటీ (10) ఢిల్లీ ఏడీఆర్‌-సెంట్రిక్‌ జురిడికల్‌ యూనివర్సిటీ (11) ఢిల్లీ ఇండియన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ (12) ఢిల్లీ విశ్వకర్మ ఓపెన్‌ యూనివర్సిటీ ఫర్‌ సెల్ఫ్‌-ఎంప్లారుమెంట్‌ (13) ఢిల్లీ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయ (ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం) (14) హర్యానా మ్యాజిక్‌ అండ్‌ ఆర్ట్‌ యూనివర్సిటీ (15) జార్ఖండ్‌ దక్ష విశ్వవిద్యాలయం (వృత్తి, జీవన నైపుణ్య విద్య) (16) కర్నాటక సర్వ భారతీయ శిక్షా పీఠ్‌

(17) కర్నాటక గ్లోబల్‌ హ్యూమన్‌ పీస్‌ యూనివర్శిటీ (18) కేరళ ఇంటర్నేషనల్‌ ఇస్లామిక్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ప్రొఫెటిక్‌ మెడిసిన్‌ (19) కేరళ సెయింట్‌ జాన్స్‌ విశ్వవిద్యాలయం (20)మహారాష్ట్ర రాజా అరబిక్‌ విశ్వవిద్యాలయం (21) మహారాష్ట్ర జాతీయ వెనుకబడిన కృషి విద్యాపీఠ్‌ (22) న్యూఢిల్లీ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ సొల్యూషన్‌ (23) న్యూ ఢిల్లీ మౌంటైన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ టెక్నాలజీ (24) పుదుచ్చేరి ఉషా లచ్చుమనన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (25) పుదుచ్చేరి శ్రీ బోధి అకాడమీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (26) రాజస్థాన్‌ రాజీవ్‌ గాంధీ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (27) ఉత్తరప్రదేశ్‌ గాంధీ హిందీ విద్యాపీఠం (28) ఉత్తర ప్రదేశ్‌ నేతాజీ సుభాష్‌ చంద్ర బోస్‌ విశ్వవిద్యాలయం (ఓపెన్‌ యూనివర్శిటీ) (29) ఉత్తర ప్రదేశ్‌ భారతీయ శిక్షా పరిషత్‌ (30) ఉత్తరప్రదేశ్‌ మహామాయ టెక్నికల్‌ యూనివర్సిటీ (31) పశ్చిమ బెంగాల్‌ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆల్టర్నేటివ్‌ మెడిసిన్‌ (32) పశ్చిమ బెంగాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆల్టర్నేటివ్‌ మెడిసిన్‌ అండ్‌ రీసెర్చ్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -