- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రం నుండి ఆశా కొత్తూరు గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న శుక్రవారం దేవి ఆలయం సమీపంలో బీటీ రోడ్డుపై ఆదివారం భారీ చెట్లు విరిగిపడ్డాయి. బలంగా వీచిన గాలులకు నాలుగు చెట్లు విరిగి రోడ్డుపై అడ్డంగా పడడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో ఎప్పుడు రద్దీగా ఉండే ఈ బీటీ రోడ్డుపై వాహనాలు ఇరువైపుల ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని జేసీబీ సహాయంతో బీటీ రోడ్డుపై అడ్డంగా విరిగిపడ్డ చెట్లను తొలగింపజేశారు. అనంతరం రోడ్డును క్లియర్ చేసి రాకపోకలను పునరుద్ధరించారు.
- Advertisement -



