Saturday, July 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాజకీయ లబ్ధి కోసమే దుద్దిళ్ల కుటుంబంపై పుట్ట అసత్య ఆరోపణలు

రాజకీయ లబ్ధి కోసమే దుద్దిళ్ల కుటుంబంపై పుట్ట అసత్య ఆరోపణలు

- Advertisement -

తీవ్రంగా ఖండిస్తున్నాం: జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సిసెల్ అధ్యక్షుడు దండు రమేష్ 
నవతెలంగాణ – మల్హర్ రావు

రాజకీయ లబ్దికోసమే దుద్దిళ్ల కుటుంబంపై మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని,ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి జిల్లా ఎస్సిసెల్ అధ్యక్షుడు దండు రమేష్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు లకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలిపారు.

గంట జ్యోత్స్న కుటుంబ సభ్యులు మంత్రిని,మంత్రి సోదరుడను ఎలాంటి సాయ,సహకారాలు కోరలేదని,పుట్ట కేవలం తన రాజకీయ ఉనికి కోసం దుద్దిళ్ల కుటుంబంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నాడని పేర్కొన్నారు.పుట్ట లాగ చెప్పుకుంటే,దుద్దిళ్ల కుటుంబం చేసిన సేవలు లెక్కలేనన్ని ఉన్నాయన్నారు.విద్యా,ఉద్యోగం,ఆరోగ్యం,ఆర్థిక అభివృద్ధి,సామాజిక అభివృద్ధి తదితర రంగాల్లో దుద్దిళ్ల సేవలు గొప్పవన్నారు.మంథని నియోజకవర్గంలో పుట్ట చేసింది గోరంత అయితే దుద్దిళ్ల కుటుంబం నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు చెసిన సేవలు కొండంతని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -