Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్అమరవీరుల కుటుంబాలకు ఇంటి స్థలం, గౌరవేతనం ఇవ్వాలి

అమరవీరుల కుటుంబాలకు ఇంటి స్థలం, గౌరవేతనం ఇవ్వాలి

- Advertisement -

తెలంగాణ ఉద్యమకారుల జెయసి రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంపల్లి సాయిలు
నవతెలంగాణ – అచ్చంపేట
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు భాగంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన కుటుంబాలకు, ఉద్యమకారులకు కళాకారులకు 250 గజాల ఇంటి స్థలం, ప్రతినెల గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చింది. మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్రం ఉపాధ్యక్షులు కాంపల్లి సాయిలు అన్నారు. శుక్రవారం అచ్చంపేట ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గత తెలంగాణ ప్రభుత్వం పదిఏళ్ళు అధికారంలో ఉన్నప్పటికీ  తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైన కుటుంబాలను ఉద్యమకారులను కళాకారులను విస్మరించిందని మండిపడ్డారు. పై డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి 31వ తేదీన పట్టణంలోని బాబు జగ్జీవన్ రావు భవనంలో ఉద్యమకారుల, కళాకారుల  రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలోని మలిదశ ఉద్యమకారులు కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో ఉద్యమ కళాకారుల వేదిక జిల్లా అధ్యక్షులు వెంకటయ్య, సంజీవ్ కుమార్, బాలస్వామి, వెంకటస్వామి, రమేష్ తదితరులు ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad