Monday, November 24, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకుటుంబ కలహాలు.. భర్త ఉరేసుకుని ఆత్మహత్య

కుటుంబ కలహాలు.. భర్త ఉరేసుకుని ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ – చంపాపేట్ : సైదాబాద్‌లో కుటుంబ కలహాల నేపథ్యంలో ఒక వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. చింతల్ బస్తీ, సైదాబాద్‌కు చెందిన నార్ర సాయి కుమార్ (24) అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అతని తండ్రి నార్ర వెంకటేష్ (50), వృత్తి: కూలీ, నవంబర్ 1వ తేదీ ఉదయం 6 గంటల నుండి మద్యం సేవిస్తూ ఉన్నాడు. అదే రోజు సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో ఆయన భార్యతో వాగ్వాదం జరగగా.. ఆ సమయంలో వెంకటేష్ భార్యను కొట్టాడు. తర్వాత ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకుని లోపలే ఉండిపోయాడు. పలుమార్లు పిలిచినా స్పందించకపోవడంతో కుమారుడు సాయి కుమార్ కిటికీ ద్వారా లోపల చూడగా, తండ్రి చీరతో సీలింగ్ ఐరన్ రాడ్‌కు ఉరేసుకుని ఉన్నట్లు గమనించాడు. వెంటనే తలుపు బద్దలుకొట్టి లోపలికి వెళ్లి తండ్రిని కిందకు దించి ఒనస్ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి మృతిచెందారు అని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -