- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఒడిశాకు చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు అభిజిత్ మజుందార్ (54) అనారోగ్యంతో కన్నుమూశారు. బీపీ, లివర్ సమస్యలతో బాధపడుతున్న ఆయన భువనేశ్వర్‌లోని AIIMSలో తుదిశ్వాస విడిచారు. 2000లో ఒడియా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన అభిజిత్, దాదాపు మూడు దశాబ్దాలుగా 700కు పైగా పాటలకు సంగీతం అందించారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
- Advertisement -



