Monday, January 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆదర్శ పాఠశాలలో ఫ్యానల్ బృందం పర్యటన

ఆదర్శ పాఠశాలలో ఫ్యానల్ బృందం పర్యటన

- Advertisement -

మహబూబాద్ జిల్లా మోడల్ స్కూల్ ల సీనియర్ మోస్ట్ ప్రిన్సిపాల్ ఎండి అక్తర్ ఉజ్జమాన్
నవతెలంగాణ – నెల్లికుదురు

మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల ను సందర్శించి ఉపాధ్యాయుల పనితీరు ను పరిశీలించి నట్లు  జిల్లా మోడల్ స్కూల్ సీనియర్ మోస్ట్ ప్రిన్సిపాల్ ఎండి యక్తర్ ఉజ్జమాన్ తెలిపారు. సోమవారం బోధన విధానాలను ఉపాధ్యాయుల నిబద్దతను విద్యార్థుల అభ్యాసన స్థాయిని పరిశీలించి ప్రశంసలు అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్యానల్ బృందం పాఠశాలలో జరుగుతున్న బోధనా విధానాలను, ఉపాధ్యాయుల నిబద్ధతను, విద్యార్థుల అభ్యాస స్థాయిని పరిశీలించి ప్రశంసలు తెలిపారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు అమలు చేస్తున్న ఆధునిక బోధనా పద్ధతులు ఎంతో ప్రశంసనీయమని అభినందించారు.అలాగే పాఠశాల ప్రిన్సిపాల్  జి. ఉపేందర్ రావు  సమర్థవంతమైన పరిపాలన, విద్యా నిర్వహణ, క్రమశిక్షణ, పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలపై ప్యానల్ సభ్యులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ప్యానల్ బృందం పాఠశాల మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -