Tuesday, September 23, 2025
E-PAPER
Homeసినిమా'ఓజీ' ట్రైలర్‌తో ఫ్యాన్స్‌ ఉత్సాహాం రెట్టింపు

‘ఓజీ’ ట్రైలర్‌తో ఫ్యాన్స్‌ ఉత్సాహాం రెట్టింపు

- Advertisement -

‘దర్శకుడు సుజీత్‌ ‘ఓజీ’ ట్రైలర్‌ను భారీ యాక్షన్‌, గ్రిప్పింగ్‌ డ్రామా, స్టైలిష్‌ ప్రెజెంటేషన్‌తో ఓ విందు భోజనంలా మలిచారు. ట్రైలర్‌ అభిమానుల ఉత్సాహాన్ని మరో స్థాయికి తీసుకొని వెళ్ళింది’ అని మేకర్స్‌ తెలిపారు. పవన్‌కళ్యాణ్‌ కథానాయకుడిగా సుజీత్‌ దర్శకత్వంలో ‘ఓజీ’ చిత్రం తెరకెక్కింది. డి.వి.వి. ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ పతాకంపై దానయ్య డీవీవీ, కళ్యాణ్‌ దాసరి నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సోమవారం ట్రైలర్‌ను రిలీజ్‌ చేసింది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ గురించి, దీనికి వస్తున్న రెస్పాన్స్‌ గురించి చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. ‘ఈ ట్రైలర్‌ పవన్‌ కళ్యాణ్‌ పాత్ర వెనకున్న రహస్యాన్ని హైలైట్‌ చేయడమే కాకుండా, పవన్‌ కళ్యాణ్‌-ఇమ్రాన్‌ హష్మీ పాత్రల మధ్య జరిగే పోరాటం పట్ల కూడా ఆసక్తి కలిగేలా చేసింది.

వెండితెరపై ఈ ఉత్కంఠభరితమైన ఘర్షణను ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఉత్సుకతను కలిగిస్తూ ట్రైలర్‌ ఉంది. దీంతో విడుదలైన తక్షణమే ఈ ట్రైలర్‌ సామాజిక మాధ్యమాల్లో అగ్రి తుఫాను సషిస్తోంది. సినిమా స్థాయిని, శక్తివంతమైన కథని, గొప్ప విజువల్స్‌ను ప్రదర్శిస్తూ.. ట్రైలర్‌ అద్భుతంగా ఉంది. 2025లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రంగా ‘ఓజీ’ ఎందుకు ప్రశంసించబడుతుందో ట్రైలర్‌ పునరుద్ఘాటిస్తుంది. ఇప్పటికే ‘ఓజీ’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కొద్దిరోజులుగా ఎక్కడ చూసినా ‘ఓజీ’ పేరు మారుమోగిపోతోంది. ఇక ఇప్పుడు ట్రైలర్‌ రాకతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. పవన్‌ కళ్యాణ్‌ ఓజాస్‌ గంభీరగా నటించిన ఈ చిత్రంలో ఇమ్రాన్‌ హష్మీ, ప్రియాంక అరుళ్‌ మోహన్‌, ప్రకాష్‌ రాజ్‌, శ్రియా రెడ్డి, అర్జున్‌ దాస్‌ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -