నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని మామిడిపల్లి నలంద పాఠశాలలో శుక్రవారం రాత్రి వీడ్కోలు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. పాఠశాల యాజమాన్యం కరస్పాండెంట్ ప్రసాద్ , ప్రిన్సిపల్ సాగర్ ఉపాధ్యాయ బృందం కలిసి సరస్వతి మాతకు జ్యోతి ప్రజ్వలన గావించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు చక్కని నృత్య ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నారు. విద్యార్థులు పాఠశాలలో జరిగిన తమ అనుభవాలను అందరితో కలిసి పంచుకున్నారు.
నలంద పాఠశాలలో చదవడం మాకు ఎంతో గర్వకారణమని విద్యార్థులు తెలపడం జరిగింది. మొదటగా పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులకు బహుమతులు మరియు శాలువాలతో సన్మానించడం జరిగింది. పాఠశాల కరస్పాండెంట్ మాట్లాడుతూ.. విద్యార్థుల అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మంచి మార్కులతో ఉత్తీర్ణత కావాలని తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు అందరూ కూడా తమ తమ ఉపన్యాసాలతో విద్యార్థులకు తమ బంగారు భవిష్యత్తును ఎలా నిర్మించుకోవాలో చక్కని నైతిక విలువలు అన్నింటిని కూడా విద్యార్థులకు తెలపడం జరిగింది. తర్వాత పాఠశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.



