నవతెలంగాణ – తుంగతుర్తి
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని,కఠిన శ్రమతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, క్రమశిక్షతో కూడిన విద్య ద్వారానే జీవితంలో మంచి ప్రయోజకులు కావాలని తుంగతుర్తి బాలుర గురుకుల పాఠశాల/కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణ అన్నారు. గురువారం కళాశాలలో ఏర్పాటుచేసిన పదవ తరగతి,ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల వీడ్కోలు సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ మేరక విద్యార్థులు ఇష్టపడి చదివి,మంచి ఫలితాలను సాధించి,సమాజంలో గుర్తింపు పొందాలని ఆయన సూచించారు. ఇంటర్ దశ నుంచే భవిష్యత్తు కోసం స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలని అన్నారు.చదువులో నిరంతర కృషి,పట్టుదల ఉంటేనే ఉన్నత శిఖరాలను అధిరోహించడం సాధ్యమవుతుందని తెలిపారు.
విద్యార్థి జీవితంలో క్రమశిక్షణ,ఉపాధ్యాయుల మార్గదర్శకాలను పాటించడం అత్యంత ముఖ్యం అని అన్నారు.ఇంటర్ తర్వాత ఉన్నత చదువులపై దృష్టి పెట్టి,కెరీర్‌లో స్థిరపడాలని సూచించారు. ఈ వేడుకల్లో విద్యార్థులు తమ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ,ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో ఏటీపీ గణేష్,సోమాని,శేఖర్, సుధాకర్,ఉప్పలయ్య,షాహిన్ నాగమణి,మణిత,కృష్ణయ్య, శ్రీనివాస్,సలీం,సంతోష్,శ్రీధర్, సుమన్,రాములు,ప్రసాద్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



