అతను పిల్లల బీడు పొలాలను సాగు చేసి
ఏపుగా పంటలను పండించే సేద్యకాడు
ఒక్కొక్క అక్షర బీజాన్ని మనసు ఆలోచన పొలంలో నాటుతాడు
కలుపు మొక్కలను ఏరివేస్తాడు
సమయానికి చదువు నీరందిస్తూ కంచె అయి కాస్తడు
దేశానికి ప్రయోజనకరమైన ఉపయోగకరమైన పంటలను తీస్తాడు
ఎక్కడైనా విలువలతో మెరిసేటట్టు
సొంత కాళ్ళ మీద నిలబడేటట్లు
ఒక్కొక్క చెట్టు గుబురుగాను
కొన్ని మామూలుగాను పూత పూసి
కాత కాసిన అన్నిటిని ఒకే రకంగా ఆదరిస్తాడు,
సమన్యాయం పాటిస్తాడు
పాఠం నీరు అన్నింటికి ఒకే రకంగా పారిస్తాడు
ప్రశ్నల వర్షం కురిపించినప్పుడు
కొన్ని వాడిన ముఖాలు అయితే
కొన్ని నిగనిగల సమాధానమైతవి
పంటనంత తన చూపు బావుల రక్షణలో
ప్రతినిత్యం నిఘా కన్నై కాస్తడు
అమ్మ ప్రేమై మెరుస్తడు
నిజమైన బాధ్యతెరిగిన విజ్ఞాన గని తను.
- గుండెల్లి ఇస్తారి, 9849983874