Wednesday, August 6, 2025
E-PAPER
Homeతాజా వార్తలురైతు పంటపై గడ్డి మందు పిచికారి..ఆత్మహత్యాయత్నం చేసుకున్న రైతు

రైతు పంటపై గడ్డి మందు పిచికారి..ఆత్మహత్యాయత్నం చేసుకున్న రైతు

- Advertisement -

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని సీతాయిపల్లి గ్రామానికి చెందిన కుర్ర చిన్న మల్లయ్య సుమారు 4 ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.  అటవీ భూమిలో 30 సంవత్సరాల నుండి భూమి సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ సంవత్సరం ఆ భూమిలో మొక్కజొన్న వరి పంటలను సాగు చేశాడు. అయితే ఈరోజు ఉదయం  ఫారెస్ట్ అధికారులు వచ్చి వరి పంటపై గడ్డి మందు స్ప్రే చేయడం జరిగింది. దీంతో వారి పంట పూర్తిగా నాశనం అయ్యింది. ఫారెస్ట్ అధికారులు చిన్న మల్లయ్య పై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా బాధితులు మల్లయ్య కూడా ఫారెస్ట్ అధికారులపై కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లడం జరిగింది. అయితే మనస్థాపన చెందిన  చిన్న మల్లెయ్యా పోలీస్ స్టేషన్ ఆవరణలో గడ్డి మందు తాగడం జరిగింది.

దీంతో వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించగా అక్కడినుండి మెరుగైన  వైద్యం నిమిత్తం కామారెడ్డి జిల్లా ఏరియా ఆసుపత్రికి, అక్కడి నుండి ఎల్లారెడ్డిపేటకు తరలిస్తున్నామని బాధితుని తమ్ముడు కొడుకు శ్రీకాంత్  వెల్లడించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ డబ్బులు ఇవ్వలేదన్న కారణంగానే  మల్లయ్య పొలంపై ఫారెస్ట్ అధికారులు గడ్డి మందు పిచికారు చేశారని ఆరోపించారు. మండలంలో వేలాది ఎకరాలలో అటవీ భూముల్లో పంటలు పండిస్తుంటే సప్పుడు చేయని అటవీ శాఖ అధికారులు డబ్బులు ఇస్తే పంట పండించుకో లేదంటే గడ్డిమంది పిచికారి చేస్తాం అంటూ బెదిరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు.
పూర్తి వివరాలు తెలుసుకొని కేసు నమోదు చేస్తాం: ఎఫ్ ర్ ఓ హేమ చందన
ఎఫ్ ఆర్ ఓ హేమచంద్రను వివరణ కోరగా ఇదివరకే రెండు మూడు సార్లు చెప్పమని అయిన వినకుండా మొక్కజొన్న పంట వరి పంట వేయడం జరిగిందని చెప్పిన వినకుండా ఇలా చేయడంతో మా సిబ్బంది గడ్డి మందు పిచికారు చేశారని నేను సెలవుల్లో ఉన్నానని ఈ విషయం నాకు తెలియదని ఆమె తెలిపారు  అయితే బాధితుని పూర్తి వివరాలు తెలుసుకొని కేసు నమోదు చేసే అంశం గురించి తెలియజేస్తామని అన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -