Saturday, February 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరైతుకు చిక్కిన పావురం

రైతుకు చిక్కిన పావురం

- Advertisement -

దాని కాలుకు జీపీఎస్‌ నెంబర్‌తో ఉన్న పట్టి
ఆందోళన, అనుమానాలు
నవతెలంగాణ-బోనకల్‌

ఓ పావురం శుక్రవారం పొలాలలో రైతుకు చిక్కింది. ఆ పావురం కాలుకు జీపీఎస్‌ 2023 ఫోన్‌ నెంబర్‌తో కాలుకు పట్టి కట్టి ఉంది. కాలుకి కట్టిన పట్టీకి నెంబర్‌ ఉండటంతో ఆ రైతు ఆశ్చర్యపోయాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలోని బోనకల్‌ మండల పరిధిలోని చొప్పకట్లపాలెం గ్రామంలో శుక్రవారం జరిగింది. ఈ పావురం గూఢాచర్యానికి సంబంధించిన పావురమా? ఇంకేదైనా ? అంటూ పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పావురం కాలుకు జీపీఎస్‌ 2023, 0165 నెంబర్‌ వేసి ఉంది. పావురం కాలుకి ఆ విధంగా గుర్తులు ఉండటంతో గ్రామస్తుల పెద్ద సంఖ్యలో వచ్చి ఆ పావురాన్ని చూడటం విశేషం. ప్రస్తుతం ఆ పావురం రైతు ఆవుల నాగేశ్వరరావు వద్దనే ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -