నవతెలంగాణ-హత్నూర
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల గ్రామ శివారులో మంగళవారం జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కాసాల గ్రామానికి చెందిన పాముల సురేష్ (30) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వ్యవసాయం, కుటుంబ పోషణ కోసం సుమారు రూ.10లక్షల వరకు అప్పులు చేశాడు. ఈ నేపథ్యంలో చేసిన అప్పులను తీర్చలేక మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నర్సాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుని తల్లి పాముల పెంటమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



