Sunday, April 5, 2026
E-PAPER
Homeక్రైమ్అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ- ముస్తాబాద్‌
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం పోతగల్‌ గ్రామంలో ఆదివారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అనమేని ఆంజనేయులు (42) వ్యవసాయం కోసం అప్పులు చేశాడు. దాంతో పాటు కూతురికి అనారోగ్య పరిస్థితుల వల్ల మరిన్ని అప్పులయ్యాయి. ఈ క్రమంలో అప్పులు తీర్చేందుకు హైదరాబాద్‌లో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయినప్పటికీ అప్పులు తీర్చే మార్గం కనబడకపోవడంతో మనస్థాపానికి గురై పోతగల్‌ గ్రామానికి వచ్చి ఆదివారం సాయంత్రం ఇంట్లో దూలానికి ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -