నవతెలంగాణ-గూడూరు
అప్పులబాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొల్లపల్లి గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బొల్లపల్లికి చెందిన రైతు కడారి వీరస్వామి(42)కి ఏడెకరాల వ్యవసాయ భూమి ఉంది. సాగు పెట్టుబడుల కోసం దాదాపు రూ.9లక్షల వరకు అప్పు చేశాడు. వ్యవసాయంలో పంటల దిగుబడి రాక, తెచ్చిన అప్పులు వడ్డీలతో పెరిగిపోవడంతో మానసిక వేదనకు గురైయ్యాడు. ఈక్రమంలోనే తన వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయ పనుల కోసం బావి వద్దకు వెళ్లిన వీరస్వామి రాత్రయినా ఇంటికి తిరిగి రాలేదు. దాంతో భార్య కమల స్థానిక బంధువులతో కలిసి వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చూడగా మృతి చెంది కనిపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. మృతుని భార్య కమల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
అప్పులబాధతో రైతు ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



