Monday, October 20, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య

- Advertisement -

వెల్దుర్తిలో ఘటన
నవతెలంగాణ -వెల్దుర్తి

ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెల్దుర్తిలో చోటుచేసుకుంది. ఆదివారం వెల్దుర్తి ఎస్‌ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన నాగరాజు (28) చేసిన అప్పులు తీర్చడం కోసం మరోచోట అప్పుచేసి టాటా ఏసీ కొనుగోలు చేసి కిరాయిలకు తిప్పుతున్నాడు. వ్యవసాయం కూడా చేస్తున్నాడు. ఈ క్రమంలో చేసిన అప్పులు తీర్చలేక అప్పుడప్పుడు ఇంట్లో గొడవలు జరుగుతుండేవని అన్నారు. అప్పులు ఇచ్చినవారు ఇంటికి వస్తూ ఉండడంతో మనస్థాపానికి గురై ఆదివారం వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకొన్నాడు. కొన ఊపిరితో ఉన్న నాగరాజును సమీపంలో గ్రామస్తులు అంబులెన్స్‌ ద్వారా హుటాహుటిన తూప్రాన్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి అప్పటికే మరణించాడని నిర్ధారించారు. నాగరాజు భార్య సంగీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమని ఎస్‌ఐ రాజు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -