- Advertisement -
నవతెలంగాణ -భిక్కనూర్
మండలంలోని జంగంపల్లి గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ భూమిని కామారెడ్డి మండలం నరసన్న పల్లి గ్రామానికి చెందిన రాజిరెడ్డి (46) ట్రాక్టర్ తో దున్నుతుండగా ట్రాక్టర్ కు అడ్డుగా వచ్చిన విద్యుత్ వైర్ తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మరణించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.
- Advertisement -