నవతెలంగాణ – తొగుట : విద్యుత్ షాక్ రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని చందాపూర్ గ్రామంలో చోటు చేసు కుంది. ఆదివారం గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చంద నర్సయ్య (54) కూడ వెళ్లి వాగు పెద్ద మత్తడి వద్ద తన పంట పొలానికి నీరు పెట్టడానికి వెళ్ళాడు. వాగు మత్తడి లో ఉన్న మోటార్ 5 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు వాగు పొంగి పోర్లడంతో మోటార్ బయ ట పడింది. గమనించిన రైతు మోటార్ సరి చేస్తు న్న క్రమంలో పక్కన ఉన్న మోటార్ వైర్ తగిలి ప్రమాదవశాస్తూ విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య రెండు సంవత్స రాల క్రితం గుండె పోటుతో మృతి చెందింది. ఇద్ద రు, కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. అందరి వివా హాలు అయ్యాయి. ప్రమాద వశత్తు నర్సయ్య మృతి చెందడం బాధాకరమని గ్రామస్థులు ఆవే దన వ్యక్తి చేశారు.
విద్యుత్ షాక్ తో రైతు మృతి…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES