- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
వేల్పూర్ మండల కేంద్రంలో సోమవారం ఫార్మర్ ఫీల్డ్ స్కూల్ ( ఎఫ్ఎఫ్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుస్థిర వ్యవసాయ కేంద్రం సహకారంతో రైతులు పండించిన నవారా, రత్నచోడి, పాతర, బైరోడ్లు కుల్కర్ వంటి దేశీయ వరి వంగడాలపై ఆగ్రోనామిస్ట్ శివ సాయి కృష్ణ, వెంకటేష్ అవగాహన కల్పించారు. అనంతరం సేంద్రియ పద్ధతిలో శ్రీ వరి సాగు విధానంలో పండించిన పంటలను రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ పద్ధతుల వల్ల రైతులకు కలిగే లాభాలు, వాటి సాగు తీరుపై రైతులకు వివరించారు. కార్యక్రమంలో సీఆర్పీలు చింత శ్రీనివాస్, మహేందర్, రవి, వెస్లీ, రైతులు ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -