నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని కంది రైతులు కంది పంటపై గంపెడాశలు పెట్టుకుని పంటను పండిస్తున్నారు. జుక్కల్ మండలంలో వ్యవసాయ అనుకూలంగా 39వేల ఎకరాలు సాగుభూమి ఉంది. అందులో భాగంగా సుమారుగా 7వేల2 వందల ఎకరాలు కంది పంటను జుక్కల్ మండలంలోని వివిధ గ్రామాల రైతులు కంది పంటను పండిస్తున్నారు. కంది రైతులు మండలంలో ఖర్చుపెట్టిన విధానం ఎకరాకు రూ. 10 నుంచి 12 వేలు పెట్టుబడి పెట్టడం జరిగింది. పంట బాగా పండితే ఎకరాకు 8 నుంచి 9 క్వింటాల కంది పంట దిగుబడి వస్తుంది.
మద్యస్థంగా పండిస్తే ఎకరాకు 4 నుండి 5 కింటాలు మాత్రమే పంట దిగుబడి వస్తుంది. ఈ లెక్కన చూస్తే కేంద్ర ప్రభుత్వం కంది పంటకు మద్దతు ధర రూ.8 వేలను ప్రకటించింది. ఈసారి పంట రైతులు బాగానే పెట్టుబడి పెట్టి పంట దిగుబడి పెంచేందుకు నానా రకాలుగా సేంద్రియ, రసాయన ఎరువులు వేయడం జరిగింది. దీంతోపాటు వ్యవసాయ పనులకు వేలది రూపాయలు ఖర్చు పెట్టారు. ఎంత తక్కువగా పంట పండిన కూడా రైతులకు కంది పంటలు మార్కెట్ ధర మాత్రం రూ.6 వేల పై చిలుకే ప్రస్తుతం ధర కొనసాగుతుంది. కంది సాగు చేసే రైతులకు పెట్టుబడి నష్టం లేకుండా ప్రస్తుత సీజన్లో పంట పండించడం జరుగుతుంది. ప్రస్తుతం మండలంలో ఎక్కడ చూసినా కంది పంట పూత , కాతా నుండి కాయ దశకు చేరుకుంది. ఇంకా రెండు మూడు మాసాల పరిధిలో పంట చేతికి వచ్చే అవకాశాలు ఉన్నాయని రైతులు అన్నారు.
పావుడే బసంత్.. రైతు, గ్రామం పడంపల్లి : నాకున్న 5 ఎకరాలలో మొత్తం కంది పంటని సాగు చేస్తున్నానని రైతు బస్వంత్ అన్నారు. పెట్టుబడి కింద ఎకరాకు రూ. 10 వేలు ఖర్చు పెట్టానని, దిగుబడి 8 నుంచి 10క్వింటాల్ రావడం జరుగుతుందని ఆశ భావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మండలంలో ఎక్కడ చూసిన కంది పంటలు బాగున్నాయని అన్నారు.




