మండల వ్యవసాయ అధికారి స్వామి నాయక్
నవతెలంగాణ – పెద్దవంగర : రైతులందరూ ఫార్మర్ ఐడీ నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి గుగులోత్ స్వామి నాయక్ అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి వ్యక్తికి ఆధార్ ఎంత ముఖ్యమో, రైతులకు ఫార్మర్ ఐడీ కూడా అంతే ముఖ్యం అన్నారు. రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయడానికి, పండిన పంటలను విక్రయించడానికి ఫార్మర్ ఐడీ తప్పనిసరి అన్నారు. పీఎం కిసాన్ లబ్ధిదారులకు తదుపరి విడత లబ్థి పొందుటకు ప్రామాణికంగా ఫార్మర్ ఐడీ నమోదును తప్పనిసరి చేస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిందన్నారు. ఈ మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్ చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్ర పథకాలకు ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్‌కు ఎటువంటి సంబంధం లేదన్నారు. ఫార్మర్ ఐడీ నమోదు కోసం రైతులు ఆధార్ కార్డు, పట్టా పాస్ పుస్తకం, ఆధార్‌కు లింక్ చేసిన ఫోన్ నెంబర్ తీసుకోని వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలన్నారు.
ఫార్మర్ ఐడీ నమోదు చేసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES