- Advertisement -
నవతెలంగాణ మద్నూర్
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫార్మర్ ఐడి ప్రాజెక్టు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో చేపట్టిన ఈ కార్యక్రమం మద్నూర్ రైతు వేదికలో ఏ ఈ ఓ సౌమ్య ఫార్మర్ ఐడి నమోదు కార్యక్రమాన్ని చురుగ్గా కొనసాగిస్తున్నారు ఈ సందర్భంగా ఏఈఓ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు కింద ప్రతి రైతుకు 11 నెంబర్ల యూనిక్ రకం సాగు వ్యక్తిగత వివరాలను డిజిటల్ రూపంలో ప్రభుత్వం నమోదు చేయనుందని తెలిపారు దీనిని ఫార్మర్ ఐడి అనేది రైతులకు అందించే డిజిటల్ గుర్తింపు కార్డు అని తెలియజేశారు ఫార్మర్ ఐడి నమోదు కార్యక్రమానికి వ్యవసాయ రైతులు భారీగా తరలివస్తున్నారు
- Advertisement -