ప్రారంభించనున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి గోపి వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర వ్యాప్తంగా ‘ఫార్మర్ కిట్స్’ పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం సచివాలయం నుంచి ప్రారంభించనున్నారు. దీంతోపాటు రైతు వేదికల్లో జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకం కింద రైతులకు శిక్షణ ఇవ్వనున్నట్టు వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి. గోపి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపిక చేసిన రైతులకు ఫార్మర్ కిట్లు అందజేస్తామని తెలిపారు. 61,125 మంది రైతులను 489 క్లస్టర్లలో, ప్రతి క్లస్టర్‌కు 125 మంది చొప్పున జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకంలో ఎంపిక చేసి సేంద్రియ వ్యవసాయంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చి సేంద్రియ వ్యవసాయం వైపు ప్రోత్సహిస్తామని వెల్లడించారు. ప్రకృతి వ్యవసాయంపై అవగాహన, గుర్తింపు కోసం ఈ కిట్‌లో క్లాత్ బ్యాగ్, క్షేత్ర దర్శిని డైరీ, గుర్తింపు కార్డు, ప్రత్యేక క్యాలెండర్, టోపీ, పెన్ను, చిన్న ప్యాకెట్ డైరీ వంటి వస్తువులను ఇస్తామని ఆయన తెలిపారు.
నేడు ‘ఫార్మర్ కిట్స్’ పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



