రూ.20లక్షల వరకు అప్పులు
నవతెలంగాణ-ఖానాపూర్
అప్పుల బాధ భరించలేక ఓ రైతు ప్రాణం తీసుకున్నాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో శనివారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సుర్జాపూర్ గ్రామానికి చెందిన రైతు సంగ రాములు(65)కు వ్యవసాయంలో కొన్నాళ్లుగా కలిసిరాలేదు. దాంతోపాటు భార్య అనారోగ్య సమస్య వల్ల ఆస్పత్రుల ఖర్చులు అయ్యాయి. ఆమె గతేడాది మృతిచెందింది. వారికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుటుంబ పోషణ కోసం దుబారు వెళ్లిన కొడుకు ఇటీవల తిరిగి వచ్చాడు. ఆర్థికంగా ఇబ్బందులెదుర్కొం టున్నారు. సుమారు రూ.20లక్షల వరకు అప్పులయ్యాయి. ప్లాట్ అమ్మి కొంత మేరకు అప్పు తీర్చినప్పటికీ మిగిలిన అప్పులు వడ్డీలతో కలిపి భారంగా మారాయి. దాంతో మనోవేదనకు గురైన రాములు శనివారం ఉదయం తన పంట చేనులో మంచెకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ రాహుల్ గైక్వాడ్ సంఘటన స్థలానికి వచ్చి విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
రైతు ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -