- Advertisement -
నవతెలంగాణ-ఆసిఫాబాద్
పంట దిగుబడి సరిగ్గా రాక.. అప్పులు తీరే దారిలేక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కుమురం భీం-ఆసిఫాబాద్ జిల్లాలో జరిగింది. సీఐ బాలాజీ వరప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్ మండలం ఈదులవాడ గ్రామపంచాయతీలోని సింగరావుపేట గ్రామానికి చెందిన మంచాల పోచయ్య పంట దిగుబడి సరిగ్గా రాలేదని మనస్తాపంతో ఈ నెల 23న పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రికి తరలించి అక్కడ నుండి మంచిర్యాలకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి సోమవారం మృతిచెందాడు. రైతు భార్య కనకలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.
- Advertisement -



