Thursday, October 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

- Advertisement -

ఎకరాకి రూ.50 వేల నష్టపరిహారం చెల్లించాలి: మండల కార్యదర్శి వర్ధo సైదులు 
నవతెలంగాణ – అచ్చంపేట
రెండు రోజుల నుంచి కురిచిన భారీ వర్షానికి రైతులు వేసుకున్న పత్తి జొన్న మొక్కజొన్న, వరి, పల్లి, పంటలు పూర్తిగా నష్టపోయాయి. తక్షణమే రెవెన్యూ అధికారులు సర్వే చేసి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని (భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు) సిపిఎం మండల కార్యదర్శి వర్ధo సైదులు గురువారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్డీవో ఆఫీస్ లో ఏవో పరిపాలన అధికారి  సలాం ఉద్దీన్ కు డిమాండ్లతో కూడిన వినత్పత్రాన్ని అందజేశారు.

 ఈ సందర్భంగా మండల కార్యదర్శి వర్ధo సైదులు మాట్లాడుతూ…. రైతులు ఆరుగాలం కష్టం చేసి కోతలు కోసేవేళ భారీ వర్షం రావడం వల్ల పంటలన్నీ దెబ్బతిని రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని,  అట్లాంటి రైతులను ప్రభుత్వము అగ్రికల్చర్ అధికారులచే సర్వేలు జయించి నష్టపోయిన రైతాంగాన్ని ఎకరాకు 50వేల చొప్పున ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. 

ఈ సంవత్సరము జూన్ నుంచి ఎడతెరిపి లేకుండా వస్తున్న వర్షాలకు రైతులు సాగు చేసిన  పంటలన్ని దెబ్బతినడంతో అప్పులు తెచ్చి పెట్టుబడి చేసిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని వారు అన్నారు. రైతాంగానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  భరోసా ఇచ్చి నష్టపోయిన రైతులను పూర్తిగా ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని సీపీఐ(ఎం) నాయకులు డిమాండ్ చేశారు. రెండో పంటపల్లి వేసుకుంటే పల్లి కూడా భారీ వర్షాల మూలంగా మొలకెత్తకుండా లక్షల పెట్టుబడి నష్టపోయే పరిస్థితి ఉందని, అట్లాంటి వారికి సబ్సిడీ ద్వారా విత్తనాలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు ఎస్. మల్లేష్, సయ్యద్వెం, వెంకటయ్య, ఎండి. ఇస్సాక్, ఏల్లమ్మ, రాములు,  నారాయణ, రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -