Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఖరీఫ్ సాగుకు రైతన్నలు సన్నద్ధం..

ఖరీఫ్ సాగుకు రైతన్నలు సన్నద్ధం..

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్  : ఖరీఫ్ పంటలు సాగు చేసేందుకు రైతన్నలు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే పలుమార్లు వర్షాలు పడి భూముల్లోకి నీరు రావడంతో తేమశాతం పెరిగింది. దీంతో రైతులు భూమిని చదునుచేసే పనిలో నిమగ్నమైనారు. మండలంలో ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్లో పెసర, మినుము, కందులు, సోయా, పత్తి, తో పాటు వివిధ రకాలైన పంటలను సాగు చేయడం ఇక్కడి రైతుల ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా మండలంలో 39 వేల ఎకరాలు వ్యవసాయానికి భూములు అనుకూలంగా ఉన్నాయి. మండలంలో గత 15 ఏళ్లుగా సోయా పంట రైతులు భారీగా పండిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం జిల్లాలోని అత్యధికంగా సోయా పండించే జుక్కల్ రైతులు ఎకరానికి అత్యధికంగా 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఇప్పటికే గ్రామాలలో రకరకాలైన విత్తనాలను, ఎరువులను రైతులు ముందస్తుగా ఇంటి వద్ద నిల్వ ఉంచుకునేందుకు ఏర్పాటు చేసుకున్నారు. వర్షం పడగానే మృగశిర కార్తిలో పంట సాగుకు అనుకూలంగా ఉంటుందని, అప్పటివరకు వేచి చూస్తామని మండల రైతులు తెలిపారు. తొలకరి వర్షాలు ఈ ఏడాది 2025 సంవత్సరం ముందస్తుగానే భారీగా వర్షాలు పడ్డాయి. రైతులు భారీ వర్షాలు పడడంతో సంతోషం వ్యక్తం చేస్తూ..భూములను సన్నద్ధం చేసుకొంటున్నారు .

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad