Wednesday, October 22, 2025
E-PAPER
Homeఆదిలాబాద్కపాస్ కిసాన్ యాప్ పై రైతులకు అవగాహన

కపాస్ కిసాన్ యాప్ పై రైతులకు అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్ 
మండలంలోని గన్నోర,రువ్వి గ్రామాలలో బుధవారం ఏఈవో రుషికేశ్ రైతులకు కపాస్ కిసాన్ యాప్ పై అవగాహన కల్పించారు. పత్తి రైతులకు సీసీఐ అందించే మద్దతు ధరను పొందేందుకు కపాస్ కిసాన్ యాప్ ను గురించి వివరించారు. ఈ యాప్ లో రైతుల వివరాలు నమోదు చేసుకుంటేనే సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి విక్రయించే అవకాశం ఉంటుందన్నారు. పత్తి నాణ్యతను బట్టి క్వింటాలుకు రూ.  8110 వరకు మద్దతు ధర లభిస్తుందన్నారు.. రైతు  లు తమ సమీప సీసీఐ కొనుగోలు కేంద్రంలో పత్తి విక్రయించి మద్దతుధర పొందాలని, యాప్ డౌన్ లోడ్ చేసుకుని వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా రైతులకు క్షుణ్ణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో రైతుల తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -